Headlines
-
భారత రాజ్యాంగం: 75 ఏళ్ల ప్రస్థానం
-
ప్రజాస్వామ్యానికి పునాది: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దారి
-
జాలని బలరాం మాదిగ: రాజ్యాంగ విలువలపై స్పష్టమైన ఆవగాహన
-
భారత రాజ్యాంగం: సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీక
-
రాజ్యాంగ దినోత్సవం: ప్రజాస్వామ్య విజయగాధ
జాలని బలరాం మాదిగ
దేశ పౌరులకు న్యాయం,స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ MSF ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షులు జాలని బలరాం మాదిగ “భారత రాజ్యాంగ దినోత్సవ”శుభాకాంక్షలు తెలియజేశారు.భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్గనిర్ధేశనంలో అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలనే MRPS సంకల్పమని MRPS సీనియర్ నాయకులు జాలని బలరాం అన్నారు.1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిఢవిల్లుతోందని అన్నారు.దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన రాజ్యాంగ నిర్మాతలను సంవిధాన్ దివస్ రోజున స్మరించుకోవడమే కాకుండా,రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు.ప్రతినిత్యం మన హక్కులు,బాధ్యతలను గుర్తుచేస్తూ అందరికీ సమానావకాశాలతో ప్రగతిపథంలో బాటలు వేయడానికి నిత్యస్ఫూర్తిగా నిలిచే మూలస్తంభం మన రాజ్యాంగం అని పేర్కొన్నారు.