Site icon PRASHNA AYUDHAM

75 ఏండ్లు దాటితే దిగిపోవాల్సిందే..!

IMG 20250713 WA1439

75 ఏండ్లు దాటితే దిగిపోవాల్సిందే..! రాజకీయ నాయకుల రిటైర్మెంట్‌ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పక్కకు తప్పుకొని, ఇతరులకు అవకాశమివ్వాలి

శాలువా కప్పారంటే దిగిపొమ్మనే అర్థం: భాగవత్‌

ఈ సెప్టెంబర్‌తో 75 ఏండ్లు పూర్తిచేసుకోనున్న

ప్రధానమంత్రి మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత

వాళ్లిద్దరూ రిటైర్‌ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్‌

నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటా..

ఇటీవల హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు

మోదీని ఉద్దేశించే అన్నారా?.. రాజకీయ వర్గాల్లో చర్చ

*‘ఏక్‌ బార్‌ పింగ్లే నే కహా థా. 75 వర్ష్‌ కే హోనేకే బాద్‌ అగర్‌ ఆప్‌కో శాల్‌ దేకర్‌ సమ్మానిత్‌ కియా జాతా హై, ఇస్‌కా మత్‌లబ్‌ హైకీ ఆప్‌కో అబ్‌ రుక్‌ జానా చాహియే! ఆప్‌కీ ఆయూ హో చుకీ హై! హట్‌ జాయీయే.. ఔర్‌ దూస్‌రోకో ఆగే ఆనే దీజియే!*

(ఒకసారి పింగ్లే ఇలా అన్నారు.. మీకు 75 ఏండ్లు వచ్చిన తర్వాత, శాలువా కప్పి సన్మానం చేశారంటే, ఇక దిగిపోవలసిన సమయం వచ్చింది. మీ వయసు అయిపోయింది. పదవి నుంచి తప్పుకుని, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వమని అర్థం)’

– నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

Exit mobile version