75’వ రాజ్యాంగ సమర్పణ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన కూకట్ పల్లీ బీజేపీ కార్యకర్తలు
ప్రశ్న ఆయుధం నవంబర్ 26: కూకట్‌పల్లి ప్రతినిధి
75’వ రాజ్యాంగ సమర్పణ దివస్ వేడుకలు కూకట్ పల్లీ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు, కూకట్ పల్లీ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన 75’వ రాజ్యాంగ సమర్పణ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి నివాళులర్పించారు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం అంటు వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో నవంబర్ 26 అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. మరీ ముఖ్యంగా ఆధునిక, లౌకిక, ప్రజాస్వామ్య, భారతదేశ నిర్మాణంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. కారణం 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అంటే సామ్రాజ్యవాదుల పాలన అంతమై, అధికారం భారత పాలక వర్గాల చేతుల్లోకి వచ్చింది.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగసభలో ముసాయిదాని ప్రవేశపెడుతూ ”రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని అమలు చేసేవారు ఉన్నతులు కాకపోతే అది ఒక చెడ్డ రాజ్యాంగంగానే నిరూపించబడుతుంది” అని చేసిన హెచ్చరిక చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగం లోని విలువలలో కాపాడుతూ రాజ్యాంగ ఫలాలను ఈ దేశంలోని ప్రతి పౌరునికి అందే విధంగా కృషి చేస్తూ, రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశ ప్రతిష్టను కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటుతుంటే కొందరు మాత్రం వారి వారి పబ్బం గడుపుకోవడానికి నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఎంత ప్రచారం చేసిన ప్రజలు వారిని నమ్మలేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయినేని సూర్యప్రకాష్ రావు, హర్సనపల్లి సూర్యారావు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు , బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.