Headlines
-
75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు: రాజ్యాంగ పాఠాలు పంచిన ఎం. శ్రీనివాస్ కుమార్
-
రాజ్యాంగ సూత్రాలపై స్పష్టత: సమానత్వం, న్యాయం, లౌకికవాదం ముఖ్యమని ఎం. శ్రీనివాస్ కుమార్
-
పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం రూపకల్పన – వ్యాపారి ప్రసంగం
-
భిన్నత్వంలో ఏకత్వం: రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలతో పంచుకున్న ఎం. శ్రీనివాస్ కుమార్
-
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ: ప్రజల భాగస్వామ్యం అవసరం – 75వ దినోత్సవ సందేశం
,26 నవంబరు: 26వతేది మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రసంగించిన ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్.1949 నవంబరు 26వ తేదీన కానిస్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కానిస్టిట్యూషన్ ఆప్ ఇండియాను అడాప్ట్ చేసుకోగా 1950 నవంబరు 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 26వ తేదికి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని .ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించరు. ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అందరితో రాజ్యాంగ పీఠికను చదివించాలని సూచించారు. ప్రజలు రాజ్యాంగ పీఠికను తెలుసుకొని రాజ్యాంగం యొక్క సారాంశాన్ని సంక్షిప్త రూపంలో పీఠికలో పొందుపరిచారని వివరించారు.
ఈ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ అన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం సమానత్వం సౌభాతృత్వం లౌకికవాదం ప్రజాస్వామ్య పాలన కోసం రాజ్యాంగం ఏర్పడిందని చెప్పారు. ప్రజలందరికీ సామాజిక ఆర్థికంగా రాజకీయ న్యాయ సమాన అవకాశాలు కల్పించిందని తెలిపారు. కుల, మత, భాషా, ప్రాంతీయ, సాంస్కృత భిన్నత్వంలో కులము, మతము, లింగ, వర్ణభేదం లేకుండా అందరిని గౌరవిస్తూ ప్రజలందరూ సమానమే అని సూచించింది. ప్రజలు రాజ్యాంగాన్ని,జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని గౌరవించాలని ఆదేశించింది. ప్రభుత్వం అనుసరించవలసిన ఆదేశక సూత్రాలు ప్రకటించి దాని కృషి చేయాలని చెప్పింది. ప్రజలందరికీ రాజకీయంగా ఆర్థికంగా, సామాజిక, న్యాయం కల్పించి సహజ వనరులు సంపద ఏ ఒక్కరి సొత్తు కాదని దానిని దేశ సంపదగా గుర్తించి ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పింది.ప్రాథమిక సూత్రాలు ప్రాథమిక హక్కులు విధులతో పాటు ఓటు హక్కును కల్పించింది. ఓటు ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మించుకొని ప్రజలే ప్రభుత్వమని ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొరకు పని చేయాలని తెలిపింది. విద్య,వైద్యము ఉపాధి అవకాశాలలొ వివక్ష లేకుండా ప్రజలు స్వతంత్రంగా జీవించే విధంగా పాలన సాగించాలని ప్రజలందరికీ రక్షణ,హక్కులు చైతన్యం ద్వారా వ్యవస్థ కొనసాగించాలని సూచించింది. సంపద కేంద్రీకృతం కాకుండా పన్నులతో ప్రభుత్వాన్ని పాలనా కొనసాగించాలని తెలియజేసింది.కీలకమైన హక్కులు కల్పించి స్వేచ్ఛ సమానత్వం లక్ష్యంగా రాజ్యాంగంలో పొందుపరిచింది. బావ ప్రకటన స్వేచ్ఛ,స్వతంత్ర జీవనం, పత్రికా స్వేచ్ఛ తో పాటు నివాస వసతులు, సేవా, న్యాయము, స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి పౌరుడికి కల్పించింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగి సామాజిక న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలని రాజ్యాంగ పీఠికలో సంక్షిప్తంగా పొందుపరిచారు. నేటి సమాజంలో ప్రజలను ప్రభుత్వాలు కేవలం ఓటరు గానే పరిగణించబడుతుంది. అందుకు అనేక సంక్షేమ పథకాలను ఓటరుకు ఎర చూపుతు తద్వారా ప్రభుత్వా నిర్మాణానికి అధికారాన్ని చేపట్టడానికి తన వైపు తిప్పుకుంటున్నది. అభివృద్ధి సంక్షేమం అనే నిరంతర ప్రక్రియ అని పథకాల ద్వారా ప్రభుత్వాలపై ఆధారపడే విధంగా ఎర్ర చూపుతున్నది. అభివృద్ధి సంక్షేమం లో ప్రజలు భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో వ్యాపారులు భాగస్వాములు కావడం చేత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కొరకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, తద్వారా ఓటరుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ప్రజలకు ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు ఓటరు తన వైపు తిప్పుకొని అధికారాన్ని దక్కించుకొని రాజకీయంగా కులాలు, మతాలు, వర్గాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని రాజ్యంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకి అందని ద్రాక్షగా మిగిలిపోతున్నది. రాజ్యాంగం కల్పించిన ఆదేశాలను హక్కులను పాలనలో కొనసాగుతున్నట్లు చెబుతున్న అది అనేక సందర్భాలలో కనిపించటం లేదు. ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్న పద్ధతి ఎన్నికల్లో పోటీ లో కనిపిస్తుంది. రాజ్యాంగ సూత్రాల ద్వారా ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరిచి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి. పథకాలను ఎరచూపి ప్రజల్ని ఓటర్లు తనవైపు తిప్పుకునే విధానానికి చరమగీతం పాడాలి. స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన నేటికి ఆకలి చావులు, అన్నదాత ఆత్మహత్యలు,అప్పుల బాధలు కులము,వర్గము, వర్ణము, లింగ, వివక్ష ప్రాంతీయ భేదము సమాజంలో అనేక అసమానతలు నేటికీ మనం చూస్తూనే ఉన్నాం. వర్గ పోరు వారసత్వ పోకడలు సమాజంలో కనిపిస్తున్నాయి. ఏ లక్ష్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ దేశ ప్రగతి నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము.అది నేటికీ నెరవేరలేదని చెప్పక తప్పదు. అభివృద్ధి అంటే అన్ని రంగాలలో విద్య, వైద్యము, న్యాయము ,శాస్త్ర సాంకేతిక, విధానాలు ఆధునిక టెక్నాలజీ పేదరిక నిర్మూలన సమ సమాజ నిర్మాణం ధ్యేయంగా వ్యవస్థలు ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగం యొక్క లక్ష్యం లౌకికవాదం సమానత్వ నిర్మాణం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు సమాజ నిర్మాణమే ధ్యేయంగా నిర్మించబడింది. అందుగ్గాను ప్రతి ఒక్కరి కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో భారత ప్రజలం అయిన మేము రాజ్యాంగాన్ని నిర్మించుకొని భారత ప్రజలమైన మనకు మనమే సమర్పించుకున్నట్టు అన్న వాక్యతో ముగుస్తుంది. రాజ్యాంగానికి దేశ ప్రజలే హక్కు దారులని దాన్ని హక్కులను పొందుతూ కాపాడుతూ దాని అమలుపరచుకుంటూ దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలందరిపై ఉందని అందుకు గాని ప్రతి ఒక్క పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు.