హైదర్ నగర్ డివిజన్ లో
ప్రశ్న ఆయుధం జనవరి 26: కూకట్‌పల్లి ప్రతినిధి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ మదర్శా స్కూల్, హోలిస్టిక్ హాస్పిటల్, మిత్ర హిల్స్, HMT శాతవాహన కాలనీ వద్ద మరియు సమత నగర్ కాలనీ లోని కార్పొరేటర్ ఆఫీసు లో 76 వ భారత గణతంత్ర దినోత్సవము సందర్బంగా జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండా వందనం సమర్పించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని .దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 76 వ వసంతం లోకి అడుగు పెడుతున్నామని తెలియచేసి హైదర్ నగర్ డివిజన్ ప్రజలకు 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది రాజ్యాంగం మనకు కలిపించిన హక్కు అని నార్నె శ్రీనివాసరావు తెలియచేసారు. అలానే ప్రతి ఒక్కరు రాజ్యాంగం రచించిన పెద్దలను గుర్తు చేసుకోవాలని కోరడం జరిగినది.