ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ సంబురాలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం, 121 కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూకట్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందుల శివకుమార్, మాచర్ల విష్ణు ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విట్టల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘు గౌడ్, వెంకటేష్ నేత, శ్రీనివాస్, పంతం వెంకటేశ్వర్లు, పరశురాం,శంకర్ రావు, ఏక్ నాద్, మహిళా నాయకురాలు వాణి, కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు తదితరులు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు