Site icon PRASHNA AYUDHAM

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గో బ్యాక్

IMG 20250421 WA0010

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గో బ్యాక్

– సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు

– కామారెడ్డి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గో బ్యాక్ పేరుతో సోమవారం దేశవ్యాప్త నిరసనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు పిలుపు మేరకు దానిలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం జిల్లా కన్వీనర్ మోతి రామ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మోతి రామ్ నాయక్ తో పాటు కో కన్వీనర్స్ జబ్బర్ నాయక్, ప్రకాష్ నాయక్,  లు పాల్గొని మాట్లాడుతూ ఈరోజు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మన దేశానికి వచ్చి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాడు, ముఖ్యంగా మనం పండించే ప్రతి పంటపై సుంకం విధించాలని ఎగుమతి దిగుమతి శుంకాలను పెంచడం కోసం, వాటితోపాటు మన దేశ పంటపై సర్వాది హక్కు అమెరికా కలగలించుకొని మన వ్యవసాయాన్ని మన దేశాన్ని దెబ్బతీయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారన్నారు. దేశంలో అనేక దేశాలు సుంకాలపై ఎదురు తిరిగినాయి కానీ మన దేశ ప్రధాని మోడీ  మాత్రం తనకు స్నేహంగా ఉంటూ మన దేశం సర్వసంపదని అమెరికాని అంటగట్టాలని చూస్తున్నారు దానికి దేశ ప్రజలు పౌరులు గుర్తించి పోరాటంలోకి రావాలని, రైతులు, ప్రజలు ఎదురు తిరిగి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదే ఒప్పందం కనుక జరిగితే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటం సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నాయక్, మల్లేష్, చంద్రకళ, నర్సమ్మ, వసంతరావు, నర్సింలు, భూమయ్య, యాదయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version