*కామారెడ్డి ఎస్పి క్యాంపు కార్యాలయం నందు మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా*
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో, ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం అనేది మన సమరయోధుల త్యాగం, పోరాటాల ఫలితం. ఆ త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి పౌరుడు దేశ ప్రగతి, సామాజిక ఐక్యత, ప్రజా భద్రత కోసం కృషి చేయాలి. పోలీసు సిబ్బంది సమాజానికి ఆదర్శంగా నిలిచి, క్రమశిక్షణతో, నిజాయితీతో విధులు నిర్వహించాలి” అని పిలుపునిచ్చారు.
ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఐపీఎస్, స్పెషల్ బ్యాంక్ ఇన్స్పెక్టర్ టి శ్రీధర్, మరియు సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, డిపిఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.