*రామకోటి సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేటలో భద్రాచల తలంబ్రాల పంపిణీ*
*రామకోటి రామరాజు సేవకు గాను భక్తుల ఘన సన్మానం*
*మేము భద్రాచలం పోలేకపోయినా తలంబ్రాలు రావడం సంతోషంగా ఉందన్న భక్తులు*
రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ మంగళవారంనాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేటలోని మార్కండేయ స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా250కిలోల గోటి తలంబ్రాలు అందించామన్నారు. గత 26సంవత్సరాల కృషికి గాను 100కిలోల తలంబ్రాలు అందించారన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొన్న వారికి తిరిగి తలంబ్రాలు అందిస్తున్నామన్నారు. సిద్దిపేట గ్రామం నుండి భక్తులు గోటి తలంబ్రాలు భద్రాచలంకు పెద్ద ఎత్తున అందించారన్నారు.
తలంబ్రాలు అందుకున్న భక్తులు ఈ సందర్బంగా మాట్లాడుతూ మేము భద్రాచలం వెళ్లలేకపోయినా కూడా మా గోటి తలంబ్రాలు కల్యానానికి వెళ్ళాయని తిరిగి మళ్ళీ మాకు ఆ రామయ్య కళ్యాన తలంబ్రాలు అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మమ్మల్ని కూడా రామయ్య సేవలో పాల్గొనేలా చేసిన రామకోటి రామరాజును భక్తులు ఘనంగా శాలువాతో సన్మానించి సీతారాముల ఫొటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెందోట శ్రీనివాస్ చారి, కాసోజు శ్రీనివాస్ చారి, బచ్చు లక్షణ్, జాప మధుసూదన్ రెడ్డి, నగేష్ జీ, గొల్లపల్లి దేవేందర్ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.