*83.45శాతం పెన్షన్ల పంపిణీ: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం*
ఏపీలో పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచి కొనసాగుతోంది.63.77 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 53.22 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందించారు. ఉదయం 10 గంటల వరకు 83.45 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ల వద్దే ఇస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు 2-3 నెలలుగా పెన్షన్లు తీసుకోని 50 వేల మందికి ఇవాళే పెన్షన్లు ఇస్తోంది.