89వ డీఐపీసీ సమీక్షా సమావేశం 

89వ డీఐపీసీ సమీక్షా సమావేశం

 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన సమావేశం

 

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 30

 

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన 89వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (DIPC) సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి DIPC ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు.

 

సమావేశంలో TG–IPASS కింద మొత్తం 1511 దరఖాస్తులు అందగా, వాటిలో 1462 దరఖాస్తులు ఆమోదం పొందాయి. 205 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయి.

 

T–PRIDE స్కీమ్ కింద SCP విభాగానికి చెందిన 3 దరఖాస్తులు ఆమోదించబడి, పెట్టుబడి సబ్సిడీగా రూ.8,93,203 (ఎనిమిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల మూడు రూపాయలు మాత్రమే) మంజూరయ్యాయి. అలాగే TSP కింద 4 దరఖాస్తులు మంజూరై, రూ.13,20,872 (పదమూడు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు మాత్రమే) సబ్సిడీగా అనుమతించబడ్డాయి.

 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వి. లాలూ, సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment