బీసీల హక్కుల కోసం బీజేపీ ఆందోళన

బీసీల హక్కుల కోసం బీజేపీ ఆందోళన

ఇంద్రపార్క్‌లో నాగారం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనిన నిరసన

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 2

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శనివారం ఇంద్రపార్క్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బీజేపీ నాగారం అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వారికి న్యాయం జరగకుండా చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బీసీల హక్కుల కోసం బీజేపీ మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment