రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజల సంక్షేమంపై ఖర్చు చేశాం: భట్టి
Aug 02, 2025,
రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజల సంక్షేమంపై ఖర్చు చేశాం: భట్టి
తెలంగాణ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజల సంక్షేమంపై ఖర్చు చేశామని DyCM భట్టి తెలిపారు. BRS, TDP, BJP కలిసి బనకచర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగిపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దతూ సాగునీటి ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు.