లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా పలు చర్యలు
మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జమ్మికుంట ఆగస్టు 2 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల లోతట్టు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, కృష్ణ కాలనీ లాంటి పలు కాలనీలలో వర్షాలు కురిసి నీటి ఉధృతి పెరిగినప్పుడు ఏర్పడ్డ చెత్తను 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శనివారం ముందస్తుగా చెత్తను తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు అనంతరం మీడియాతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ జమ్మికుంట , ఆబాదీ జమ్మికుంట పోయే మార్గంలో గల బ్రిడ్జి మత్హడి కాల్వ ను చెట్ల పొదలు తొలిగించి శుభ్రం చేయించడం జరిగిందని గతంలో ఏర్పడ్డ చెత్త వల్ల లోతట్టు ప్రాంతాలకు అధిక వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు సులువుగా కిందికి పోకుండా చాలా ఇండ్లు నీట మునగడం జరిగిందని దానిని దృష్టిలో పెట్టుకొని అందులోని చెత్తను తొలగించే పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో నీరు చేరకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు మున్సిపాలిటీ కమిషనర్ వెంట మున్సిపల్ ఏ ఈ లు నరేష్ , వికాస్ ,ఈ ఈ శ్రీకాంత్ , సానిటరీ ఇనస్పెక్టర్ సదానందం , ఆఫీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు