స్ట్రాంగ్ రూమ్లు సిద్ధం చేయండి: SEC
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఒకవైపు ప్రభుత్వం పోరాటం చేస్తుండగా, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను సన్నద్ధం చేయాలని తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సిబ్బంది, ఇతర సామగ్రితో పాటు పూర్తి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని ఇప్పటికే సూచించింది.£