డివిజన్, జిల్లా పంచాయతీ అధికారులకు తెలుసా చట్టాలు..?

డివిజన్, జిల్లా పంచాయతీ అధికారులకు తెలుసా చట్టాలు..?

ఒకరికి ఒక తీరు, మరొకరికి మరో తీరు – పంచాయతీ అధికారులపై ప్రజల ఆగ్రహం..!

భూమి వివాదాల్లో నిర్భాగ్యంగా బాధితుడే నిందితుడిగా మారుతున్న దుస్థితి..!

చట్టం స్పష్టంగా ఉన్నా, అధికారుల వివరణలు అస్పష్టంగా మారుతున్నాయ్..!

అనుమతి లేకుండా నిర్మాణాలు – అరికట్టడంలో నిర్లక్ష్యం చేస్తే పంచాయతీనే రద్దు చేయొచ్చు

పంచాయతీ చట్టం, సెక్షన్ 114పై అధికారి అవగాహన లేకపోవడమే సమస్య మూలం…!!

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా:

గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు చట్టాలను పాటించడంలో తీవ్ర విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి ఒక నిబంధనను, మరికొందరికి మరో నిబంధనను వినిపిస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారని బాధితులు మండిపడుతున్నారు.

తన భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు సాదాబయినమా పత్రాలు, భూమి విక్రయించిన వ్యక్తి వచ్చి ఈ స్థలాన్ని ఇతనికి అమ్మానని చెప్పినా అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ కాగితం చూపించలేదంటూ కేసును తిరస్కరించారు. ఆ విషయంలో చట్టాన్ని గుర్తు చేసుకుంటున్నా అధికారులు, అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని, చట్ట పరిధిలోని అంశంపై విచారణ చేయకుండా తేల్చేయడాన్ని ప్రజలు గట్టిగా తప్పుపడుతున్నారు.

తెలంగాణ నూతన గ్రామపంచాయతీ చట్టం 2018 ప్రకారం, సెక్షన్ 114 ప్రకారం ఏ నిర్మాణమైనా పంచాయతీ అనుమతి లేకుండా చేపట్టకూడదని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ, అనుమతులు లేకుండా పలు నిర్మాణాలు సాగిపోతుండడం, అధికారులు చర్యలు తీసుకోవడంలో చొరవ చూపకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

గ్రామపంచాయతీలకు G+2 భవనాల వరకు అనుమతి ఇచ్చే అధికారం ఉన్నా, దరఖాస్తులకు 24 గంటల్లో స్పందించాల్సిన నిబంధన ఉన్నా వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవగాహన లేకుండా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే, పంచాయతీని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. ప్రజలపై మనవిచ్చే బదులు, చట్టాన్ని అర్థం చేసుకుని న్యాయం చేయడమే అధికారుల బాధ్యత అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment