శభాస్ శామీర్‌పేట్ పోలీసులు..!
చెరువులో పడిపోయిన మృతదేహాన్ని స్వయంగా వెలికితీసిన పోలీసులు..
మృతుడిని బొల్లారానికి చెందిన రవికాంత్‌గా గుర్తింపు..
ప్రజల మెప్పు పొందిన సీఐ శ్రీనాథ్, ఎస్‌ఐ శశివర్ధన్ రెడ్డి టీమ్.
కుటుంబ సభ్యులకు సమాచారం – మరింత దర్యాప్తు కొనసాగుతూనే ఉంది..
మృతదేహాన్ని రోడ్డుపైకి మోసుకొచ్చిన దృశ్యం స్థానికుల్లో హర్షం..
ప్రశ్న ఆయుధం..శామీర్‌పేట్, ఆగస్టు 5
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో పడిపోయిన మృతదేహాన్ని స్వయంగా మోసి రోడ్డుపైకి తీసుకొచ్చిన పోలీసులను స్థానికులు మెచ్చుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ ద్వారా చెరువు ఒడ్డున మృతదేహం కనిపించిందన్న సమాచారం రావడంతో ఎస్‌ఐ శశివర్ధన్ రెడ్డి తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న వారు ముందుకు రాకపోవడంతో పోలీసులే ఒక స్థానికుడి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపైకి మోసుకొచ్చారు.విచారణలో మృతుడు రవికాంత్ రావు (38)గా గుర్తించారు. హైదరాబాద్లోని బొల్లారం ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.