కలుపు యాజమాన్యమే  దిగుబడుల కు ఆధారం ఏడీఏ అపర్ణ.

_కలుపు యాజమాన్యమే  దిగుబడుల కు ఆధారం

_ఏడీఏ అపర్ణ

_కామారెడ్డి జిల్లా ఆగస్టు 5: (ప్రశ్న ఆయుధం)

ఏ పంటలోనైనా కలుపు యాజమాన్యం కీలకమని కామారెడ్డి జిల్లా వ్యవసాయ విభాగ అధికారి (ఏడీఏ) అపర్ణ పేర్కొన్నారు. వరి పంటను ఈ ఖరీఫ్‌లో డివిజన్‌ పరిధిలో 80,000 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.కలుపు మొక్కలు 50-60 శాతం దిగుబడిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.వరిలో తుంగ, గడ్డి, వెడల్పాకు మొక్కలు ప్రధాన పంటతో పోటీపడి దిగుబడికి నష్టం కలిగిస్తాయని తెలిపారు.ఈ కలుపు మొక్కలు తెగుళ్లు,కీటకాలకు ఆధారమొక్కలుగామారుతాయని హెచ్చరించారు.

గట్లపై ముందస్తు చర్యలు అవసరం

నాటు ముందు గట్లపై ఉండే వయ్యారిభామ వంటి కలుపును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్లూఫోసేట్ అమోనియం @ 5 మి.లీ / లీటరు నీటికి

ప్యారా క్వాట్ @ 5 మి.లీ / లీటరు నీటికి

ఈ మందులతో గట్లపై మాత్రమే పిచికారీ చేయాలని సూచించారు.స్ప్రేయర్ కుడ్ పరికరం ఉపయోగించి ప్రధాన పొలానికి మందు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రైతులు కలుపు యాజమాన్యంలో అవగాహన పెంచుకోవాలని ఏ  డీ ఏ అపర్ణ సూచించారు.

Join WhatsApp

Join Now