బోనాల పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు
మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్
సర్కిల్ ఇన్స్పెక్టర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో బుధవారం రోజున బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ అన్నారు సోమవారం అంబేద్కర్ నగర్లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సి ఐ గణేష్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోనాల పండగ ధార్మిక ఉత్సవాలకు మణిహారం మాతృ శక్తికి అంకితమైన ఈ బోనాల ఉత్సవం నగరానికి ఆధ్యాత్మిక వెలుగు నింపుతుందని అని అన్నారు తొర్రూర్ భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని శానిటేషన్. త్రాగునీరు. విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాట్లలో ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారని అని అన్నారు కావున భక్తులు తీసుకువచ్చే బోనాలు అమ్మవారికి సమర్పించి ఆనందంగా పండగను జరుపుకోవాలని కోరారు.
సీఐ గణేష్ మాట్లాడుతూ…బుధవారం జరిగే బోనాల పండుగ తొర్రూరు పట్టణ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఇది కేవలం భక్తి భావన మాత్రమే కాదని ఒక కుటుంబ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే సందర్భం అని అన్నారు. పోతరాజుల ఆటలు డప్పులు నృత్యాలు మతపరమైన ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయని కావున తొర్రూరు పట్టణ ప్రజలు టెంపుల్ కి వెళ్లేదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు సహకరించాలని టెంపుల్ మొత్తం సీసీ కెమెరా సర్వే లైన్స్ లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రంజిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మచ్చ సురేష్ కాంగ్రెస్ నాయకులు దొంగరీ శంకర్. బిజ్జాల అనిల్. మనోహర్. కుశాల్ అశోక్ రెడ్డి. మంగళపల్లి పళ్ళ నాగరాజు, కుంట కొమ్ము యాకయ్య, సుధాకర్, ప్రతాప్, మురళి తదితరులు పాల్గొన్నారు