బోనమెత్తిన ఝాన్సీరెడ్డి..

బోనమెత్తిన ఝాన్సీరెడ్డి..

జనగామ జిల్లా: కొడకండ్ల మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో కలిసి అమ్మవారికి బోనం ఎత్తి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరాధనా సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని,ఇలాంటి పండుగలు సాంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేస్తాయని, మహిళల భక్తి శ్రద్ధకు, సమాజంలో వారి పాత్రకు బోనాల పండుగ ప్రతిరూపమని ఝాన్సీరెడ్డి అన్నారు. వారి వెంట, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు శ్రీవర్ణ,మండల యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల యాకేష్ యాదవ్,మండల కాంగ్రెస్ నాయకులు అందే యాకయ్య, పసునూరి మధు, మహిళాలు యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment