అనుమతులు లేవు… అయితేనేం..? గుట్టలు తవ్వడం మాత్రం జోరుగా!

• అనుమతులు లేవు… అయితేనేం..? గుట్టలు తవ్వడం మాత్రం జోరుగా!

• భాస్కర్‌నగర్, తాళ్ల గొమ్మురు వద్ద అక్రమంగా గుట్టల తొలగింపు..!

• ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక, మట్టి, కంకర్, ఇటుకలు అమ్మకాలు.!

• పేదవాడి ఇంటి కలను నెట్టేసే ‘ఇంటి పేరుతో’ అప్పుల బరువు.!

• అధికారుల నిర్లక్ష్యంపై మండల ప్రజల ఆగ్రహం..!

మండలంలో ఎక్కడైనా గుట్ట కనిపిస్తే చాలు… తవ్వేస్తాం, అమ్మేసుకుంటాం అనే ధోరణి పట్టింది కొందరికి. అనుమతులు లేకుండానే భారీగా భూమి తవ్వకాలు, మట్టి, ఇసుక, కంకర్ అమ్మకాలు నిర్భయంగా కొనసాగుతున్నాయి. భాస్కర్‌నగర్, తాళ్ల గొమ్మురు గ్రామాల్లో గుట్టలను నయం చేస్తూ నిగ్రహం తప్పిన పనులు సాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పేర్లు చెప్పుకుంటూ మద్యవర్తులు అధిక ధరలకు నిర్మాణ సామాగ్రిని అమ్ముతున్నారు. ఆ ఇళ్ల కల నెరవేరకముందే పేదవాడు అప్పుల గుంతలో పడిపోతున్నాడు. అధికారుల ఆదేశాలకూ తలొగ్గని పరిస్థితి. మండల అధికారులు చూస్తూ చూశంత పని చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఇల్లు కాదు గుట్టలే అమ్ముకుంటున్నారు’’ అంటున్న మండల ప్రజలు, వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment