జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి ఘనంగా నిర్వహణ

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి ఘనంగా నిర్వహణ

ప్రశ్న ఆయుధం ఆగస్టు 06: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర రూపకర్త, ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి వేడుకలు నేడు జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. జి.వి. నర్సింహా రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అన్ని విభాగాల ప్రొఫెసర్లు, ఉద్యోగులు, యూనివర్సిటీ ఉన్నతాధికారులు మరియు పక్క ప్రాంతాల సేవల ఉద్యోగులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ప్రిన్సిపాల్ డా. జి.వి. నర్సింహా రెడ్డి మాట్లాడుతూ, “ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ, తెలంగాణ ప్రజల పట్ల జరిగే అన్యాయాలను గుర్తించి అవగాహన కలిగించడంలో కీలక పాత్ర వహించారు. రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు ఆయన” అని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. ఏ. రఘురామ్, సిఆర్‌సి చైర్మన్ డా. పార్వతి, డా. బి. రవీందర్ రెడ్డి, డా. కె. శ్రీనివాస్ రెడ్డి, నాగ శరద్, మాధవ్ రెడ్డి మరియు పలువురు ప్రొఫెసర్లు పాల్గొని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం చేసిన అమూల్యమైన సేవలను కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment