బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

పిడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్

జమ్మికుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్ డిమాండ్ చేశారు బుధవారం రోజున జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక మండలాల్లోని వైన్ షాపుల నుంచి యథేచ్ఛగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతోందని, దీనిపై ఎక్సైజ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా), పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అధిక ధరలు నాణ్యతలేని ఆహారం అంగిడి కుమార్ మాట్లాడుతూ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్ళలో గంటల తరబడి మద్యం సేవిస్తూ అమ్మకాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులలో అధిక ధరలకు మద్యం అమ్ముతూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని, అంతేకాకుండా నాణ్యతలేని తినుబండారాలు అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు.

వైన్ షాపుల లైసెన్స్‌లు రద్దు చేయాలి బెల్ట్ షాపులను నడుపుతున్న వైన్ షాపుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపుల యజమానులపైనా, వాటి నిర్వాహకులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.బెల్ట్ షాపుల దందాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అంగిడి కుమార్ హెచ్చరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment