ఘనంగా ప్రొపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఘనంగా ప్రొపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

జమ్మికుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఎన్ఎస్ఎస్(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ అధ్యక్షతన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జయ శంకర్ సార్ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రొ. జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్- ప్రిన్సిపాల్ డాక్టర్ ఓదెలు కుమార్ , స్టాప్ సెక్రటరీ డాక్టర్ గణేష్, అకాడమిక్ – కోర్డినేటర్ డాక్టర్ రాజేంద్రం. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎంబాడి రవి, లోఖండే రవీందర్, అధ్యాపకులు డాక్టర్ శ్యామల, డాక్టర్ మాధవి, ఉమాకిరణ్ , రాజ్ కుమార్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుష్మా, డాక్టర్ రవి ప్రకాష్, ప్రశాంత్ , రమేష్ వాలంటీర్లు, విద్యార్థులు తదితదరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment