చేతుల హస్తచిత్రమే నేతన్న కళ – రామకోటి

తిమ్మాపూర్ నేతన్నలకు ఘన సన్మానం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రామకోటి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం

చేనేత సేవలను కొనియాడిన రామకోటి రామరాజు

చేతుల హస్తచిత్రమే నేతన్న కళ – రామకోటి వ్యాఖ్య

ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలంటూ పిలుపు

చేనేతే మన సంస్కృతి – మన అస్థిత్వానికి ప్రతిబింబం

10 మంది నేతన్నలకు శాలువాలతో ఘనంగా సన్మానం

ప్రశ్న ఆయుధం జగదేవపూర్, ఆగస్టు7

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కళాకారులుగా నిలిచిన తిమ్మాపూర్ నేతన్నలకు శ్రీరామకోటి భక్త సమాజం ఘనంగా సన్మానం చేసింది. గురువారం తిమ్మాపూర్ గ్రామంలోని మార్కండేయ స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు నేతన్నలకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, “చేనేత కళలు చేతులతో సృష్టించే అద్భుతాలయే. ప్రతి నేతన్న శ్రద్ధతో నేస్తున్న వస్త్రాలే మన భారతీయతకు అసలైన ప్రతిరూపాలు. చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా వారి జీవనోపాధికి అండగా నిలవాలి. మన సంస్కృతిని, అస్థిత్వాన్ని నిలబెట్టే చేనేతను పరిరక్షించుకోవాలి,” అని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం చేనేత రంగ పరిరక్షణకు మరింత కృషి చేయాలని కోరుతూ, ప్రతి ఒక్కరూ చేనేత పట్ల చైతన్యంతో ముందుకు రావాలన్నారు.

సన్మానిత నేతన్నలు:

వీరబత్తిని ఉప్పలయ్య, గుజ్జ సిద్ధిరాములు, హనుమాండ్ల మల్లయ్య, సిరిసిల్ల యాదగిరి, గుజ్జ కనకయ్య, కొంక బాలరాజ్, వీరబత్తిని కుమార్, కోట కిష్టయ్య, దేవసాని పోచయ్య, తలకొక్కుల సత్యనారాయణ, దేవసాని నరేందర్.

చేనేత రంగాన్ని గౌరవించే దిశగా రామకోటి సంస్థ వేసిన అడుగు అభినందనీయమంటూ గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment