అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ పోస్టర్ల ఆవిష్కరణ
జమ్మికుంట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులు చేరబోయే విద్యార్థులు ఈనెల (ఆగస్టు) 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కె రాజేంద్రమ్ తెలిపారు గురువారం రోజున అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ పోస్టర్ల ను కళాశాల సిబ్బంది తో కలిసి ఆవిష్కరణ నిర్వహించారు విద్యార్థుల సౌకర్యార్థం సమత నిపుణ వి హబ్ వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఈ పథకాల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొన్నారు అధ్యయన కేంద్ర సమన్వయకర్త మాట్లాడుతూ లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యార్థులకు చదువుతూ పనిచేసుకునే అవకాశం కల్పించబడుతుందని వయోజనులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించబడిందని ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు గణేష్ కిరణ్ కుమార్ శ్యామల రాజకుమార్ శ్రీనివాస్ రెడ్డి రవి ప్రకాష్ రమేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు