ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలు
*బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు*
*జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్ట్ 7 ప్రశ్న ఆయుధం*
భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని దానిలోనే భాగంగా రక్షాబంధన్ ఒకటని ఒకరికి ఒకరు తోడు అని ఉండడానికి రాఖీని కట్టుకోవడం జరుగుతుందని చిన్నపిల్లలకు ప్రతి పండుగ విశిష్టతను తెలియపరచవలసిన అవశ్యకత ఉందని బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు గురువారం రోజున చిన్న కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమం లో పాల్గొని పేర్కొన్నారు రక్షాబంధన్ పండుగ భారతదేశంలో ప్రతి హిందువు జరుపుకోవడం జరుగుతుందని యుద్ధానికి వెళ్లే సైనికునికి తన భార్యతో రక్షాబంధన్ కట్టుకొని వెళ్లడం విజయాన్ని వరించడం జరుగుతుందని ప్రతిదీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు ఉంటామని రక్షాబంధన్ తెలియజేస్తుందని జిల్లా కౌన్సిల్ మెంబర్ రాంబాబు తెలిపారు