గంగా ఉగ్రరూపం… మహాశివుడి విగ్రహం వరదలో తడిసిముద్ద

గంగా ఉగ్రరూపం… మహాశివుడి విగ్రహం వరదలో తడిసిముద్ద

రుషికేశ్‌లో గంగా ఆగ్రహం

నీటిమట్టం పెరిగి కట్టడాలను తాకిన ప్రవాహం

మహాశివుడి విగ్రహం చుట్టూ అలల తాకిడి

తీరం వద్ద గట్టి హెచ్చరికలు జారీ

యాత్రికులు, స్థానికులకు అధికారులు అప్రమత్తం

(ప్రశ్న ఆయుధం)..రుషికేశ్, ఆగస్టు 8:

రుషికేశ్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గంగానది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి నగర తీరప్రాంతాలను ముంచెత్తింది.

ప్రవాహం పెరగడంతో తీరం వద్ద ఉన్న మహాశివుడి విగ్రహాన్ని నీరు తాకి చుట్టూ అలలు ఆడాయి. ఆ దృశ్యం భక్తులను, పర్యాటకులను ఆకర్షించినా, అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

నీటి వేగం, ఎత్తు పెరగడంతో తీరప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లరాదని స్థానికులకు సూచనలు అందించారు. నది పక్కన ఉన్న కట్టడాలు, ఘాట్లు వరద నీటిలో మునిగే ప్రమాదం ఉన్నందున యాత్రికులకు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రక్షణ సిబ్బంది పహారాలు కాయుతున్నారు.

Join WhatsApp

Join Now