రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి..!
సోషల్ మీడియాలో వీడియో వైరల్..!!
“సార్ మీకు దండం పెడుతా… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి”
“ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవదు”
మంత్రి పదవి లభించదనే అంచనా
రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు
హైదరాబాద్:
“రాజగోపాల్ రెడ్డి సార్… మీకు దండం పెడుతా, దయచేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి” అంటూ ఓ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు తప్పవని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశమే లేదని స్పష్టం చేశారు. మీకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వదలచుకోలేదన్న ఉద్దేశ్యంతోనే ఈ సూచన చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.