” శ్రీ నల్ల పోచమ్మ, మైసమ్మ తల్లి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న సత్యం శ్రీరంగం “

” శ్రీ నల్ల పోచమ్మ, మైసమ్మ తల్లి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న సత్యం శ్రీరంగం ”

ప్రశ్న ఆయుధం ఆగస్టు 08: కూకట్‌పల్లి ప్రతినిధి

” అమ్మవార్ల దయతో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలి – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం ”

బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్ లో శ్రీ నల్ల పోచమ్మ, మైసమ్మ తల్లి విగ్రహ మరియు బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయని సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగగా, పుణ్యహవచనం, అభిషేకాలు, హోమాలు, శాంతి పాఠాలతో ఆలయం ఆధ్యాత్మికతతో మార్మోగింది. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆపదల నుండి ఆదుకునే అమ్మవార్ల అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో విరాజిల్లాలని అన్నారు. గ్రామానికి పునాది బొడ్రాయి అని, పూర్వ కాలం నుండి బొడ్రాయికి ఎంతో ప్రతిష్ట ఉందన్నారు. ఆధ్యాత్మిక భావాలు, దైవ చింతన సమాజంలో శాంతికి దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరు భక్తి భావాలను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు మధు గౌడ్, గోవు అరుణ వెంకట్ రెడ్డి దంపతులు, దేవాలయ కమిటీ చైర్మన్ అత్తికారి మల్లేష్, తిరుపతయ్య, రాము, గిరి సాగర్, శేఖర్ రెడ్డి, అర్జున్, రాజు, సురేందర్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment