రామారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన 

రామారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 8

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు.

శుక్రవారం రోజున రామారెడ్డి మండలంలోని రంగంపేట్ గ్రామములొ జిల్లా కలెక్టర్ పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. నిరుపేదలు సైతం సంతోషంగా సొంత ఇంటిలో సౌకర్యవంతంగా నివసించేందుకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ లభ్యమయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం చూసుకుంటుందని త్వరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునే విధంగా ఇసుక, మొరం మరియు ఇటుకలు ఏలాంటి కొరత లేకుంట లబ్దిదారులకు అంధుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి.విజయపాల్ రెడ్డి, MPDO, మండల స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ AE, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment