జుక్కల్ నియోజకవర్గ ఆడబిడ్డలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ నియోజకవర్గ ఆడబిడ్డలతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) ఆగస్టు 09

రాఖీ పౌర్ణమి సందర్భంగా పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో..మండలానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కి రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాఖీలు కట్టిన అక్కా చెల్లెళ్లతో పాటు నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు..అదేవిధంగా నేను కూడా మీ సోదరుడుగా, మీ అన్నగా,మీ తమ్ముడిగా మీ వెన్నంటి ఉండి..జుక్కల్ అభివృద్ధిలో మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని అన్నారు..మా అక్కా చెల్లెల ఆశీర్వాదం నాపై ఎప్పటికీ ఉండాలని కోరుతూ మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment