రాఖీ పండుగ రద్దీపై ఆర్టీసీ దోపిడి

రాఖీ పండుగ రద్దీపై ఆర్టీసీ దోపిడి “స్పెషల్ బస్సుల”పేరుతో అధిక చార్జీల వసూలు

కరీంనగర్, ఆగస్టు 9

రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్–వరంగల్ మార్గంలో సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తూ ‘రాఖీ స్పెషల్’ బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నారు.సాధారణ టికెట్‌కు అదనంగా వసూలు చేస్తూ, బస్సుల ముందు ‘గోల్డ్’ లేదా ‘స్పెషల్’ బోర్డులు అతికించి అధిక రేట్లను విధించడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని సద్వినియోగం చేసుకునే ఈ విధానాన్ని ఆపాలని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment