రైతు బీమా నమోదుకు చివరి గడువు ఆగస్టు 13
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 9 ప్రశ్న ఆయుధం
కొత్త పట్టాదారు పాసు బుక్కులు వచ్చిన రైతులు రైతు బీమా నమోదు చేసుకోవడానికి చివరి గడువు ఆగస్టు 13 వరకు ఉందని మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ తెలిపారు కొత్త పట్టాదారు పాసు బుక్ జూన్ 5 వరకు వచ్చి ఇదివరకు రైతు బీమా నమోదు చేసుకోని వారు మాత్రమే రైతు బీమా నమోదు చేసుకోవాలని కోరారు రైతు బీమా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు ఫారం రైతు పట్టాదారు పాసు బుక్ జిరాక్స్ రైతు ఆధార్ కార్డు జిరాక్స్ నామిని ఆధార్ కార్డు జిరాక్స్ జతచేసి సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని తెలిపారు రైతులు ఆగస్టు 14 1966 నుండి 14 ఆగస్టు 2007 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే రైతు బీమాకు అర్హులు అని మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ తెలిపారు