నాగర్ కర్నూల్ జిల్లా…..తుపాకీతో బెదిరింపులు
హల్ చల్ చేసిన వ్యక్తి
పాత కక్షలతో మాజీ సర్పంచ్ టార్గెట్
పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామంలో ఓ వ్యక్తి డమ్మీ తుపాకీతో మాజీ సర్పంచ్ను హతమారుస్తానని బెదిరిస్తూ గత నాలుగు రోజులుగా భయాందోళన సృష్టించాడు. శనివారం మధ్యాహ్నం గ్రామస్తులు అతడిని పట్టుకొని పోలీసు లకు అప్పగించారు. గతంలో ఎత్తం గ్రామ సర్పంచ్గా మిద్దె కృష్ణయ్య పనిచే శారు. ఆ సమయంలో బోయ లక్ష్మణ్ అనే వ్యక్తి తన భార్యను వేధించగా, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సందర్భంగా సర్పంచ్ కృష్ణయ్య లక్ష్మణ్ పై చేయి చేసుకు న్నాడు. ఈ పాత కక్షతో లక్ష్మణ్ సర్పంచ్పి పగ పెంచుకున్నాడు. తన ప్యాంట్ జేబులో పిస్టల్తో తిరుగుతూ మాజీ సర్పంచ్ను చంపుతానని బెదిరిం పులకు పాల్పడ్డాడు. ఈ విషయంగ్రామంలో దావనంలా వ్యాపించడంతో, గ్రామస్థులు లక్ష్మణ్ ను రోడ్డుపైనే పట్టుకొని, అతడి జేబులో నుంచి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోడేర్ పోలీస్ స్టేషన్లో అప్ప గించారు. పిస్టల్ను పరిశీలించిన ఎస్సె జగదీష్, అది డమ్మీ తుపాకీ అని నిర్ధా రించడంతో ఎత్తం గ్రామస్థులు, ముఖ్యంగా మాజీ సర్పంచ్ ఊపిరి పీల్చు కున్నారు.