కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదంటే.. కవిత షాకింగ్ కామెంట్స్
మాజీ మంత్రి కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.
సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు కార్మికుల సమస్యలపై HMSతో కలసి అలయన్స్గా పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.
సింగరేణి జాగృతి, HMS అలయన్స్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని ఉద్ఘాటించారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ అవినీతి ఎక్కువ అయిందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం తీసుకునే కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఓపెన్ కాస్ట్ మైన్స్‌తో పెద్ద పెద్ద వాళ్లకు లాభం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ మైన్స్‌ను ఓపెన్ చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సింగరేణిలో పనిచేసేవారికి ఇండిపెండెంట్‌గా ఉద్యోగాలు ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు..