దుబ్బరాయేశ్వర స్వామి కి విశేష అభిషేకాలు, గాజుల పేరంటం 

దుబ్బరాయేశ్వర స్వామి కి విశేష అభిషేకాలు, గాజుల పేరంటం

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 11

 

శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బీబీపేట సభ్యులు కుటుంబ సమేతంగా మెదక్ జిల్లా లో గల పుణ్యక్షేత్రం చౌదర్పల్లిలో శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి కి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి డివిజన్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బాశెట్టి నాగేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

 

శ్రావణమాస సోమవారం సందర్భంగా మెదక్ జిల్లా చౌదరిపల్లిలో గల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం బిబిపేట మహిళలు” గాజుల పేరంటం” నిర్వహించారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బా యాదగిరి, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి శ్రీనివాసు, వాసవి క్లబ్ అధ్యక్షులు నాగభూషణం, కార్యదర్శి ఉప్పల సాయినాథ్, విశ్వ ప్రసాద్, తాటిపల్లి రమేష్, కామారెడ్డి డివిజన్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బాశెట్టి నాగేశ్వర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now