అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్
వికసిత భారత్ లక్ష్యంగా మోడీ 3.0 బడ్జెట్
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు
జమ్మికుంట ప్రశ్న ఆయుధం జూలై 23
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి ఏర్పడ్డాక మంగళవారం రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ బడ్జెట్ పై స్పందించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తుందని, దానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని కితాబిచ్చారు. ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను రాజు చేయాలనే ఉద్దేశంతో, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలానే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడానికి బడ్జెట్ లో పెద్దపీట వేయడం జరిగిందని సంతోషించారు. మహిళా సాధికారత దిశగా మహిళలను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారని, బడ్జెట్ లో మహిళలకు అత్యధిక నిధులు కేటాయించడం దానికి నిదర్శనమని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం ఉత్పత్తి సేవలు పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక వసతులు పరిశోధన అభివృద్ధి అత్యధిక సంస్కరణలు తదితర అనేక విషయాలను పరిధిలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్ ను రూపొందించాలని దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలుస్తుందని సంపత్ రావు అన్నారు. ఈ బడ్జెట్ ను దేశ ప్రజలు సంతోషంగా స్వాగతించే బడ్జెట్ అని ఒక ప్రకటనలో తెలిపారు.