ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యుల అరెస్టు అప్రజాస్వామికం

ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యుల అరెస్టు అప్రజాస్వామికం

*ఓట్ల చోరీపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ వాస్తవాలను వెల్లడించాలి*

*మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల రాజు*

*జమ్మికుంట ఆగస్టు12 ప్రశ్న ఆయుధం*

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులపై ఎన్డీఏ సర్కార్ వ్యవహరించిన తీరును జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు తప్పుపట్టారు జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబాల రాజు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున కర్గే పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ తో పాటు విపక్ష పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ వాస్తవాలు చెప్పాలని ప్రజల పక్షాన నిలబడడానికి ర్యాలీ నిర్వహిస్తే పోలీస్ బలగాలతో అడ్డుకోవడం అన్యాయమని ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశమైన భారత్ లో ఓటే ప్రధాన ఆయుధమని అలాంటి ఓటును ధన దాహంతో కేంద్రంతో కుమ్మక్కైన ఎలక్షన్ కమిషన్ కర్ణాటకలోని ఓ పార్లమెంట్ పరిధిలో లక్ష ఓట్లను బీహార్ రాష్ట్రంలో 58 వేల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనన్నారు అధికారం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతటి దిగజారుడు రాజకీయాలైన చేస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు కేంద్రం ఒత్తిళ్లకు తలోగ్గి ఎన్నికల కమిషన్ ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని అంబాల రాజు హితువు పలికారు ఈ ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరు సైతం భాగస్వామ్యులు కావాలని అంబాల రాజు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేనా రమేష్ కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి మ్యాకమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి, యువజన కాంగ్రెస్ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రామిడి సూర్యతేజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగ అశోక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now