*ఆధమరిస్తె అంతే సంగతి*
జుక్కల్ నియోజక వర్గం
(ప్రశ్న ఆయుధం)ఆగస్ట్13
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం పిట్లం మండలం లోని కుర్తి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద ర్యాంప్ బ్రిడ్జ్ వద్ద. ప్రమాదలకు నిలయంగా గత ఎండాకాలం లో కురిసిన వర్షాలకు బ్రిడ్జ్ గోడ కూలి నడి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది..
రాత్రి వేళలో ఆదమరిసి ప్రయాణిస్తే భారీగ ప్రమాదం సంభావించే అవకాశం ఉంది..
ఇదే రహదారి గుండా గ్రామం లోని ప్రజాపాల సమావేశానికై ప్రస్తుత ఎమ్మెల్లే లక్ష్మి కాంతారావ్, ఇంచార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సైతం ప్రయాణించారు..
కాని ఇప్పటికి ఆ గుంతని పూడ్చలేదు…
అలాగే గత ప్రభుత్వ హయం లో కుర్తి గేట్ నుండి గ్రామం వరకు బిటి రోడ్డు రేనివల్ కొరకు శంక్షన్ ఉన్న వారి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు రెనివల్ చేయలేదు..ప్రస్తుత ప్రభుత్వం సైతం రెండు సంవత్సరాల అవుతున్న సర్వే లు మాత్రం చేశారు. కాని రోడ్డు వేయడం లేదు.
ఇకనైనా రోడ్డు రేనివల్ లో భాగంగా అట్టి బ్రిడ్జ్ ని నిర్మించి,రోడ్డు వేసి
ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరడం జరిగింది.