మహిళా సాధికారత  కేంద్రం సిబ్బంది  అవగాహన .

మహిళా సాధికారత  కేంద్రం సిబ్బంది  అవగాహన .

 

మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం.

 

కామారెడ్డి జిల్లా .

(ప్రశ్న ఆయుధం )ఆగస్టు 13.

 

బుధవారం రోజున  జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ మరియు ఫైనాన్సియల్ లిట్రసి అనే అంశము పై అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన వివిధ అంశాలతో కూడిన పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఏ ప్రమీల , సూపరిండెంట్ అరుణ్ భాస్కర్ రావు కళాశాల ప్రిన్సిపాల్ , విద్యార్థులు జిల్లా మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now