కామారెడ్డి మరియు అడ్లూర్ యెల్లారెడ్డి చెరువును సందర్శించిన జిల్లా ఎస్పీ*

కామారెడ్డి మరియు అడ్లూర్ యెల్లారెడ్డి చెరువును సందర్శించిన జిల్లా ఎస్పీ*

 

 

• *వాతావరణ శాఖ ద్వారా 3-4 రోజులు భారీ వర్షాలు కురిసే హెచ్చరికలు ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి*

• *జిల్లాలో వర్షాలతో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే డయల్ 100 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 కాల్ చేసి సహాయం పొందవచ్చు. 24/7 పోలీస్ సేవలు అందుబాటులో ఉండును.*

• *వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి పోలీస్ అధికారులు సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలి*

_*జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్*_

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 13

 

 

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరియు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం తీసుకోవాలిసిన చర్యలు, వివిద శాఖల అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రోడ్డుకు ఇరువైపులా స్టాపర్స్ పెట్టి ప్రజల రాకపోకలను నిలుపుదల చేయాలని సూచించారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలతో మరియు ప్రజాప్రతినిధుల తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణాలలో గ్రామాలలో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకుని, ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే సంబంధిత అధికారుల సహకారంతో ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కావున అలాంటి ఇళ్ళల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగులు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేందుకు ఎవరు వెళ్లవద్దని సూచించారు. నిర్విరామంగా కురిసే వర్షాల కారణంగా విద్యుత్ స్థంబాలకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం వున్నందున జిల్లా ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా జాగ్రత్తగా వుండాలని, అలాగే విధ్యుత్ సరఫరా లో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. ఎవరైనా సమస్యలో లేదా ఇబ్బందుల్లో ఉంటే డయల్ 100 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08468-220069 నెంబర్లకు సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని జిల్లా ఎస్‌పి తెలిపారు.

Join WhatsApp

Join Now