రానున్న మూడు రోజులు భారీ వర్షాలు,అధికారులకు స్పెషల్ ఆఫీసర్ హెచ్చరికలు

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు,అధికారులకు స్పెషల్ ఆఫీసర్ హెచ్చరికలు

 

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 13

 

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉండాలని మండల స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు.

 

వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టి, ఎక్కడా ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. పశుసంపదను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పెషల్ ఆఫీసర్ స్పష్టం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రతి విభాగం సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now