తాడ్వాయిలో భవ్యంగా తిరంగా ర్యాలీ

తాడ్వాయిలో భవ్యంగా తిరంగా ర్యాలీ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి,(ప్రశ్న ఆయుధం)ఆగస్టు 14

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భాగంగా గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు వెల్మ సంతోష్ రెడ్డి, ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, రాష్ట్ర హార్టీకల్చర్ కన్వీనర్ గంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటరావు, హోటల్ శ్రీను, మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, బాలాజీ, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, OBC మోర్చా అధ్యక్షుడు ముదాం దత్తాత్రేయ, బూత్ అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తిరంగా పతాకాలతో ఊరంతా గలగలా నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ దేశభక్తి జ్వాలలు రగిలించిందని నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now