ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

అధికార ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక

ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ చర్చల్లో పాల్గొనడం

మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్‌

తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్‌గా కూడా సేవలు

న్యూఢిల్లీ,

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన, ఇంతకుముందు తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. స్వస్థలం తమిళనాడే అయిన రాధాకృష్ణన్ ఎంపికతో దక్షిణ భారతంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment