పోస్టర్లు ఆవిష్కరణ…

ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ…

ప్రశ్న ఆయుధం 23జులై మోటకొండూర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ ను ఫోటోగ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుడు బీమిడి మాధవరెడ్డి మోటకొండూర్ మండల కేంద్రంలో స్థానిక ఎస్సై ఎస్ పాండు, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు లోడే చంద్రశేఖర్ తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో అండ్ వీడియో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28వ తేదీల్లో ఎల్బీనగర్ లోని కే.బి.ఆర్ కన్వెన్షన్ లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్పోను ఫోటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫోటోగ్రఫీలో నూతన ఆవిష్కరణలను అదేవిధంగా వాటి వాడకాన్ని ఎక్స్పో ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పల రెడ్డి, జిల్లా ఫోటోగ్రాఫర్స్ ప్రధాన కార్యదర్శి రెడ్డిగాడి రాము, మండల ప్రధాన కార్యదర్శి మానెగల్ల విక్రమ్ ముదిరాజ్, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు భూమండ్ల శివ కుమార్, బొజ్జ శంకర్, వడ్డెబోయిన శ్రీనివాస్, మానేగళ్ళ శశి, ఆడెపు సూర్య కుమార్, మామిడాల చింటూ, మాటూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now