‘జాతీయ మహిళా కమిషన్’లో పీవీ సింధు, మహేశ్ భగవత్
జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీలో 21 మంది ఎంపిక
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తెలంగాణ ఎడీజీ మహేశ్ భగవత్‌కు చోటు
కమిషన్ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్ ఆధ్వర్యంలో కమిటీ
సామాజిక సేవకులు కామకోటి, హర్షవర్ధన్ అగర్వాలుకు అవకాశం
మహిళా సంక్షేమంపై కీలక నిర్ణయాలకు నూతన బృందం సిద్ధం
న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ 2025 సలహా కమిటీలో కొత్తగా 21 మందిని నియమించింది. ఈ కమిటీలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్ సభ్యులుగా ఎంపికయ్యారు. కమిషన్ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో సామాజిక సేవకులు కామకోటి, హర్షవర్ధన్ అగర్వాలూ స్థానం దక్కించుకున్నారు. మహిళా సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విధానాల రూపకల్పనలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.