డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష

గాంధారి మండలంలో పోలీసులు వాన తనిఖీలు

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చర్యలు

ఎల్లారెడ్డి జె ఎఫ్ సి ఎం కోర్టు తీర్పు

ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష, రూ.1100 జరిమానా

12 మందికి జరిమానాలు విధించిన పోలీసులు

గాంధారి ఎస్సై ఆంజనేయులు వివరాలు

ప్రశ్న ఆయుధం గాంధారి, ఆగస్టు 22:

వాహనదారులపై పోలీసులు చేపట్టిన వాన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు పట్టుబడ్డారు. ఈ కేసులను ఎల్లారెడ్డి జె ఎఫ్ సి ఎం కోర్టుకు రప్పించగా, న్యాయమూర్తి ఎం. సుష్మ శుక్రవారం తీర్పు వెలువరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1100 జరిమానా విధించారు. అదనంగా 12 మందికి జరిమానాలు విధించబడ్డాయి.

గాంధారి ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రాణాలతో ఆటలు ఆడవద్దని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment