కోటగిరిలో ఆయిల్ పామ్ అవగాహన సదస్సు

కోటగిరిలో ఆయిల్ పామ్ అవగాహన సదస్సు

అడ్కాస్‌పల్లి గ్రామంలో రైతులకు అవగాహన

ఆయిల్ పామ్ పంటలో ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ – అధికారులు

చీడపీడల బెడద తగ్గింపు, ఎరువుల వినియోగం కూడా తక్కువ

నాలుగేళ్ల వరకు అంతర పంటలతో అదనపు లాభం

అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్న సదస్సు

ప్రశ్న ఆయుధం ఆగష్టు 22

కోటగిరి మండలం అడ్కాస్‌పల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంట అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంటను మిగతా పంటలతో పోలిస్తే రైతులకు ఆదాయం ఎక్కువగా వస్తుందని, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని వివరించారు.

అలాగే ఈ పంటలో చీడపీడ పురుగుల బెడద తక్కువగా ఉండడం, ఎరువులు తక్కువ మోతాదులో వాడుకోవడం వల్ల రైతులకు అనేక విధాలా లాభం కలుగుతుందని తెలిపారు. పంట మార్పిడి విధానంలో ఆయిల్ పామ్ సాగు చేయడం వలన నేల సారవంతత పెరుగుతుందని, మొదటి నాలుగేళ్లలో అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. రాజు, హార్టికల్చర్ ఆఫీసర్ వాహిద్ జుమ్మా, వ్యవసాయ విస్తీర్ణ అధికారి యన్. సతీష్ కుమార్, ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీతో పాటు రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment