గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడు

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 22 ప్రశ్న ఆయుధం

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకోగా తల్లిదండ్రులు గ్రహించి ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానీపల్లి గ్రామానికి చెందిన పెండ్లి సమ్మయ్య కి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు కుమారుని పేరు పెండ్లి నవీన్ 24 సంవత్సరాలు పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉంటూ తల్లిదండ్రులతో పాటుగా వ్యవసాయం చేస్తుండేవాడు ఈనెల 19న పొలం వద్దకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి కక్కుచుండగా తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగగా గడ్డి మందు తాగాను అని చెప్పడంతో అతనిని జమ్మికుంట లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా ఇంటికి తీసుకువచ్చారు 21వ తేదీన నవీన్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో జమ్మికుంట లోని వేరొక ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకుపోగా డాక్టర్ చూసి సీరియస్ గా ఉందని అనడంతో హనుమకొండలోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 41 నిమిషాలకు మరణించాడు మృతుడి తండ్రి అయిన పెండ్లి సమ్మయ్య తన కొడుకు నవీన్ మరణం లో ఎలాంటి అనుమానం లేదని అతడు అప్పుడప్పుడు అల్సర్ తో తీవ్రంగా బాధపడుతూ ఉండేవాడని దానికోసం మందులు వాడుతూ ఉండేవాడని పోలీస్ స్టేషన్ నందు తన తండ్రి పిర్యాదు ఇవ్వడంతో ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment